ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో..   సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ/మినహాయింపు లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని  ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. పార్లమెంట్, అసెంబ్లీల్లో ప్రశ్నలకైనా, ఓటుకైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. 

1998లో పీవీ నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజాగా సరికొత్త తీర్పు ఇచ్చింది.  చట్టసభల సభ్యుడు లంచం ఇవ్వడం ప్రజాజీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, లంచాలు తీసుకోవడం నేరమని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు పేర్కొంది.

1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో జేఎంఎం ఎంపీగా ఉన్న శిబు సోరెన్‌ సహా ఇదే పార్టీకి చెందిన మరో నలుగురు ఎంపీలు లంచాలు తీసుకుని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి మద్దతుతో మైనార్టీలో ఉన్నప్పటికీ పీవీ ప్రభుత్వం గట్టెక్కింది. ఆ తర్వాత సోరెన్‌ సహా ఐదుగురు ఎంపీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. 

Also Read :మార్చి15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు