
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి15 నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మార్చి 15వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
మధ్యాహ్న భోజనాన్ని మధ్యా హ్నం 12.30 గంటలకు అందజేస్తారు. పదో తరగతి పరీక్షల సమయంలో పరీక్షాకేంద్రాలున్న బడుల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన తరువాత తరగతులను నిర్వహిస్తారు.
పదో తరగతి పరీక్షలు పూర్తయిన తరువాత తిరిగి ఉదయం వేళ స్కూల్స్ నిర్వహిస్తారు. విద్యార్థుల పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.