ఇండియాలో సిగరెట్లు కొనటం కంటే.. వియాత్నంకు విమానంలో వెళ్లి సిగరెట్లు కొనటం చౌక

ఇండియాలో సిగరెట్లు కొనటం కంటే.. వియాత్నంకు విమానంలో వెళ్లి సిగరెట్లు కొనటం చౌక

ఇప్పుడు సిగరెట్ స్మోకర్స్ కి ఓ భయం పట్టుకుంది.. ఇకనుంచి సిగరెట్ తాగడం మానేయాల్సి వస్తుందా అని.. ఎందుకంటే సిగరెట్ మరింత ఖరీదు కానుంది. కేంద్ర ప్రభుత్వ ట్యాక్స్ రీఫామ్స్ నిర్ణయంతో  సిగరెట్ ధరలు భారీగా పెరగనున్నాయి. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి  రానున్నాయి. ఇదంతా చూస్తుంటే  సిగరెట్ ప్రియుల  ఆందోళన మొదలైంది. పెరగబోతున్న ధరలను ఊహించుకుంటూ.. తమకు ఇష్టమైన సిగరెట్ కు దూరం కావాల్సి వస్తదేమో ఆందోళనతో  సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సిగరెట్లపై డబ్బు ఆదా చేయడం ఎలా అనే దానిపై సలహాలు, చిట్కాలు చెబుతూ సెటైర్లు వేస్తున్నారు. 

సనా సెక్యూరిటీ  ఫౌండర్ రజత్ శర్మ .. భారత్ లో సిగరెట్ల ధరలపై ఇలా స్పందించారు. సిగరెట్లపై డబ్బు ఆదా చేసేందుకు ఓ వింత చిట్కా చెప్పాడు. ఇండియాలో సిగరెట్ కొనడం కంటే విమానంలో వియత్నాం వెళ్లి సిగరెట్ తాగి రావడం చాలా చౌక అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. 

Xలో పోస్ట్ షేర్ చేసిన శర్మ ఇలా రాశాడు. మార్ల్ బోరో లైట్స్ (20 ప్యాక్ ) ప్రస్తుతం ధర రూ. 340.ఎక్సైజ్ సుంకం, కంపెనీ సుంకం  పెంపుతో  రూ. 400లకు చేరుతుంది. అదే సిగరెట్ ధర వియత్నాంలో రూ. 120 నుంచి 130  లు ఉంటుంది. న్యూఢిల్లీ నుంచి హెచిమిన్ నగరానికి రానుపోను విమాన టెకెట్ ధర రూ.21వేలు.. మీ చైన్ స్మోకర్లు అయితే.. విమానంలో వియత్నాం ప్రయాణించి 20 స్టిక్ ల 75 ప్యాకెట్లను కొనుగోలు చేయండి.. అక్కడ వాటి ధర కేవలం రూ.3వేలే..ఇది ఛార్జీలను కవర్ చేస్తుంది..ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.. డబ్బు ఆదా చేసుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు శర్మ. 

అయితే శర్మ సలహా ఆన్ లైన్ చాలామందికి నచ్చలేదు. శర్మ పోస్ట్ కు రిప్లై ఇచ్చిన ఓ నెటిజన్ ఇలా రాశాడు. పొగతాగడం మానేయొచ్చు..పది లక్షల ఆస్పత్రి బిల్లులు ఆదా చేయొచ్చు... చాలా సంతోషంగా జీవించొచ్చు అంటూ సెటైరికల్ గా రాశాడు. 

మరో నెటిజన్ స్పందిస్తూ.. వియత్నాం టూరిజాన్ని ప్రోత్సహించే బదులు.. పొగతాగడం  మానెయొచ్చుగా..ఆరోగ్యరమైన ఆహారం తీసుకోండి..ఆరోగ్యంగా జీవించండి..లేకుండా శాశ్వతంగా వియత్నాంకు వెళ్లిపోండి అంటూ కొంచెం ఘాటుగానే  స్పందించాడు. 

భారత్ లో సిగరెట్ల ధరల పెరుగుదల..
ప్రభుత్వ కొత్త పన్ను విధానంతో ఫిబ్రవరి 1నుంచి సిగరెట్లు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. GSTకి అదనంగా సిగరెట్లపై ప్రత్యేక కేంద్ర ఎక్సైజ్ సుంకం పడుతుంది. బ్రాండ్ పేరు ,సిగరెట్ పొడవుపై ఆధారంగా సిగరెట్ల ధరల పెరుగుదల అత్యధికంగా ఉంటుందని, ఫిల్టర్ లేని పొట్టి సిగరెట్ల ధరల పెరుగుదల తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక సిగరెట్ల ధరల పెరుగుదల విషయం తెలియగానే  ధూమపానం ప్రియులు తెగ ఆందోళన చెందుతున్నారు.