అకౌంట్లో పడిన రూ.40 కోట్లతో ట్రేడింగ్..20 నిమిషాల్లోనే కోటి 75 లక్షల లాభం..కట్ చేస్తే కోర్టు కీలక తీర్పు

అకౌంట్లో పడిన రూ.40 కోట్లతో  ట్రేడింగ్..20 నిమిషాల్లోనే కోటి 75 లక్షల లాభం..కట్ చేస్తే కోర్టు కీలక తీర్పు

అదృష్టం, టాలెంట్.. అంటే ఇతడిదే .. ఉదయాన్నే లేచి ఎవరి మొహం చూశాడో గానీ లచ్చిం దేవి తలుపు తట్టింది. అతడి అకౌంట్లో 40 కోట్లు వచ్చిపడ్డాయి. అంతే కాదు ఆ డబ్బుతో  ట్రేడింగ్ చేసి  జస్ట్ 20 నిమిషాల్లోనే కోటి 75 లక్షల లాభం పొందాడు. ఇతడి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అనుకోకుండా వచ్చిన అదృష్టానికి తోడు తన  టాలెంట్ వాడి ట్రేడింగ్ చేయడం  అమోఘం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  అసలేం జరిగిందో  పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ముంబైకి చెందిన గజానన్ అనే  ట్రేడర్ 2021 అక్టోబర్ లో కోటక్ సెక్యూరిటీస్ లో ట్రేడింగ్ కమ్ డీ మ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారు.  2022 జూలై 26న  అతడి అకౌంట్లో కోటక్ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ సంస్థ పొరపాటును రూ. 40 కోట్లు అతడి అకౌంట్లో జమ చేసింది. అయితే వాటిని అతడు వెంటనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు.  అంతే అతడు పొద్దున లేచి చూసే సరికి కోటి 75 లక్షల లాభం వచ్చింది. అతడి సుడి తిరిగింది. పెట్టిన పెట్టుబడి లాభం కలిసి రూ.41.75 కోట్లు వచ్చాయి.  2025 డిసెంబర్ 24న బాంబే  కోర్టు తీర్పుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Also Read : సింగపూర్ ఎన్నారై మహిళకు రూ. 1.35 కోట్ల లాభం.. పన్ను నోటీసు వచ్చినా.. జీరో ట్యాక్స్ !

ట్రేడర్ అకౌంట్లో రూ.40 కోట్లు జమ అయిన వెంటనే కోటక్ సెక్యూరిటీస్ తమ సిస్టమ్ లో జరిగిన లోపాన్ని గుర్తించి  అతడిని సంప్రదించింది. దీంతో ట్రేడర్ గజానన్  రూ.40కోట్లను  తిరిగి కోటక్ సెక్యూరిటీస్ సంస్థకు ఇచ్చేశాడు.  అయితే తమ డబ్బుతో వచ్చిన లాభం రూ.1.75 కోట్లు కూడా తమకే ఇవ్వాలని సంస్థ డిమాండ్ చేసింది. ట్రేడర్ ఇవ్వకపోవడంతో ఇద్దరు కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన బాంబే కోర్టు కీలక వ్యాక్యలు చేసింది.  ట్రేడర్ సంపాదించిన రూ.1.75 కోట్లు అతడికే  చెందుతాయని అభిప్రాయపడింది.  అతడు ఎవరిని మోసం చేయలేదు..అక్రమంగా సంపాదించలేదు కోటక్ సెక్యూరిటీస్ కు నష్టం కూడా జరగలేదని  తెలిపింది. అయితే విచారణ సందర్బంగా..  లాభాన్ని తమకు ఇస్తే రూ.50 లక్షలు పరిహారం ఇస్తామని కోటక్ సెక్యూరిటీస్ ట్రేడర్ కు ఆఫర్ ఇచ్చింది.  కానీ అతను ఈ ఆఫర్ ను తిరస్కరించారు. దీంతో తదుపరి విచారణ వరకు  లాభం వచ్చిన కోటి 75 లక్షలను ట్రేడర్ దగ్గరే ఉంచాలని విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది కోర్టు.