సింగపూర్ ఎన్నారై మహిళకు రూ. 1.35 కోట్ల లాభం.. పన్ను నోటీసు వచ్చినా.. జీరో ట్యాక్స్ !

సింగపూర్ ఎన్నారై మహిళకు రూ. 1.35 కోట్ల లాభం.. పన్ను నోటీసు వచ్చినా.. జీరో ట్యాక్స్ !

ముంబైకి చెందిన ఓ మహిళ(NRI) సింగపూర్‌లో నివసిస్తుంది. ఆమె ఇండియాలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టారు. వాటిని అమ్మడం ద్వారా ఆమెకు రూ. 1.35 కోట్ల లాభం (Capital Gains) వచ్చింది.
 
దింతో ఆమె సింగపూర్ నివాసి కాబట్టి, భారత్-సింగపూర్ మధ్య ఉన్న డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA ) ఒప్పందం ప్రకారం.. ఆమె ఆ లాభంపై సింగపూర్‌లోనే పన్ను కడతానని, ఇండియాలో కట్టనని చెప్పింది. కానీ ఈ లాభం ఇండియాలోని ఆస్తుల నుండి వచ్చింది కాబట్టి, ఇండియాలోనే పన్ను కట్టాలని అధికారులు ఆమె నోటీసు ఇచ్చారు.

Also Read : లేట్ ఫీజుపై 30% రాయితీతో మీ పాలసీని యాక్టివేట్ చేసుకోండి.

దింతో కోర్టు మెట్లు ఎక్కిన ఆమె.... మొదట పన్ను అధికారులు, ఆ తర్వాత 'డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్' (DRP) ఆమె వాదనను తోసిపుచ్చారు. దీనిపై ఆమె ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT ) ముంబై బెంచ్‌ను ఆశ్రయించారు. గతంలో ఇండియా-యూఏఈ (UAE) ఒప్పందంపై వచ్చిన ఒక తీర్పును ఆమె తరపు లాయర్లు గుర్తు చేసారు.

 ITAT ముంబై ఆమె వాదనతో ఏకీభవించింది. భారత్-సింగపూర్ ఒప్పందంలోని ఆర్టికల్ 13(5) ప్రకారం.. ఇలాంటి లాభాలపై ఎవరైనా  ఎక్కడ నివసిస్తుంటే (అంటే సింగపూర్) అక్కడ మాత్రమే పన్ను విధించాలని స్పష్టం చేస్తూ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వల్ల ఆ మహిళకు భారతదేశంలో ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా పోయింది.