ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ప్రీమియం కట్టలేక ఆగిపోయిన పాలసీలను మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక క్యాంపైన్ మొదలుపెట్టింది. ఈ అవకాశం జనవరి 1, 2026 నుండి మార్చి 2, 2026 వరకు కొనసాగుతుంది. టైంకి ప్రీమియం కట్టక ఆగిపోయిన అన్ని పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఇది వర్తిస్తుంది.
*సాధారణ పాలసీల లేట్ ఫీజుపై 30% వరకు రాయితీ అంటే గరిష్టంగా రూ. 5,000 వరకు లభిస్తుంది.
*మైక్రో ఇన్సూరెన్స్ (small finance) పాలసీలు ఉన్నవారికి లేట్ ఫీజులో 100% మినహాయింపు ఉంటుంది.
*ఆరోగ్య పరీక్షలు లేదా మెడికల్ అవసరాలకు సంబంధించిన ఖర్చులపై ఎలాంటి రాయితీలు ఉండవు.
ఎందుకు ఈ అవకాశం?
పాలసీదారులు వారి ఉన్న ఇన్సూరెన్స్ రక్షణని కోల్పోకూడదనే ఉద్దేశంతో LIC ఈ నిర్ణయం తీసుకుంది. పాత పాలసీకి బదులు కొత్తగా తీసుకోవడం కంటే, ఆగిపోయిన పాలసీని మళ్ళీ మొదలుపెట్టడం వల్ల పాలసీదారునికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
