చైనాలోనూ డెల్టా వేరియంట్ కేసులు..200 మందికి పాజిటివ్

చైనాలోనూ డెల్టా వేరియంట్ కేసులు..200 మందికి పాజిటివ్

కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాలో ఇప్పుడు డెల్టా వేరియంట్ బయట పడింది. అనేక నగరాల్లో డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క నాన్ జింగ్ నగరంలోనే 200 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొన్నిరోజుల కిందట నాన్ జింగ్ ఎయిర్ పోర్టులో 9 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా సోకింది. దాంతో వారి సంబంధీకులకు, వారు కలిసిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 200 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఆ కేసులన్నీ డెల్టా వేరియంట్ కేసులేనని అధికారులు తెలిపారు. దీంతో కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేశారు.

కరోనా నివారణకు సొంతంగా వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన చైనా.. వాటిని ప్రజలకు యుద్ధప్రాతిపదికన అందించింది. అయితే డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్న క్రమంలో.. ఆ టీకాలు సరైన రక్షణ ఇవ్వలేకబోయాయన్న అభిప్రాయాలు విన్పిస్తున్నాయి.