ఉద్దవ్ థాక్రేపై ట్వీట్ చేసి డిలీట్ చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ భార్య

ఉద్దవ్ థాక్రేపై ట్వీట్ చేసి డిలీట్ చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ భార్య

మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కుతున్న వేళ... ఉద్ధవ్ థాక్రేపై బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్  వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. కానీ ట్వీట్ చేసిన ఆ పోస్ట్ ను ఆమె కొంత సేపటికే తొలగించారు. అంతకీ ఆ పోస్ట్ లో ఏముంది.. ఎందుకు డిలీట్ చేశారన్న విషయానికొస్తే.. ఏక థా కపటీ రాజా అంటూ ఆమె ట్విట్టర్లో  రాసుకొచ్చింది. దీని అర్థం ఒక చెడ్డ రాజు ఉన్నాడు. అయితే ఆమె చేసిన ఈ పోస్ట్ లో ముఖ్యంగా థా అనే అక్షరానికి కొటేషన్ గుర్తులు పలు సందేహాలకు దారి తీస్తున్నాయి. ఇక్కడ స్పెషల్ గా థా అనే లెటర్ ను హైలెట్ చేయడమనేది శివసేన ముఖ్యమంత్రి థాక్రేను సూచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ ట్వీట్ దేశ వ్యాప్తంగా వైరల్ గా మారడంతో.. వెంటనే ఆమె తన అకౌంట్ నుంచి ఆ పోస్ట్ ను తొలిగించినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా..మహారాష్ట్ర పాలిటిక్స్ గంట గంటకు మలుపుతిరుగుతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులతో మహా రాజకీయం రసవత్తరంగా మారింది.  రెబల్ ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే మకాంను అస్సాంకు మార్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో  మహారాష్ట్ర కాంగ్రెస్కు అబ్జర్వర్గా నియమితులైన కమలనాథ్..కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తుండటం చర్చనీయాంశమైంది. శాసనసభ నేత బాలాసాహెబ్ థోరత్ నివాసంలోమొత్తం 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు..  సీనియర్ లీడర్లతో ఆయన మీటయ్యారు. ఈ సమావేశం అనంతరం కమల్ నాథ్..సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలవనున్నారు. ఈ సమయంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకు కొవిడ్ బారిన పడ్డారు.  కొవిడ్ చికిత్స కోసం ఆయన HN రిలయన్స్ ఫౌండేషన్ లో అడ్మిట్ అవడంపై.. తదుపరి పరిణామాలు ఎలా చోటు చేసుకుంటాయోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.