
వీకెండ్ కావడంతో ఖైరతాబాద్ బడా గణేశుడి చెంతకు శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనం కల్పించగా, సాయంత్రం సమయంలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. భక్తుల సౌకర్యార్థం అర్ధరాత్రి 11:45 వరకు మెట్రో సేవలు కొనసాగాయి. 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. - వెలుగు, హైదరాబాద్ సిటీ