Hebah Patel: థియేటర్లోకి హెబ్బా పటేల్‌ ‘థాంక్యూ డియర్’.. మూవీ రిలీజ్ డేట్ ఇదే

Hebah Patel: థియేటర్లోకి హెబ్బా పటేల్‌ ‘థాంక్యూ డియర్’.. మూవీ రిలీజ్ డేట్ ఇదే

ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో తోట శ్రీకాంత్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘థాంక్యూ డియర్’. పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు.  ఆగస్టు 1న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించారు. 

డైరెక్టర్ శ్రీకాంత్ తోట మాట్లాడుతూ ‘సమాజంలో జరిగే ఒక బర్నింగ్ ఇష్యూను తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో ఫ్యామిలీ అంతా చూసేలా తెరకెక్కించాం. కట్ బ్యాక్ స్క్రీన్ ప్లేతో ఎంగేజ్‌‌‌‌‌‌‌‌ చేయబోతోంది.  ఈ చిత్రానికి ఇప్పటికే పలు అవార్డులు వచ్చాయి.  ఇందులోని సందేశానికి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు’అని చెప్పాడు.

అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోహీరోయిన్స్‌‌‌‌‌‌‌‌ ధనుష్ రఘుముద్రి, రేఖా నిరోషా థాంక్స్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత బాలాజీ తెలియజేశారు.  సంగీత దర్శకుడు సుభాష్,  లైన్ ప్రొడ్యూసర్ పునీత్ పాల్గొన్నారు.