డిసెంబర్ నెలతో 2025 ఏడాది ఇంకొన్ని రోజుల్లో అయిపోతుంది. అయితే గూగుల్ ఇండియా 2025 ఇయర్ ఇన్ సెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ సంవత్సరం భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా ఎం వెతికారో ఈ రిపోర్ట్ చూపిస్తుంది. ఈసారి ప్రజలు స్పోర్ట్స్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, జాతీయ కార్యక్రమాలు, వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువగా సెర్చ్ చేసారని గూగుల్ చెబుతుంది. 2025లో, ఐపీఎల్, ఉమెన్స్ క్రికెట్ వంటి క్రీడా కార్యక్రమాలపై భారతీయులు ఎక్కువ ఆసక్తి చూపగా.. గూగుల్ జెమిని వంటి AI టూల్స్, నానో బనానా వంటి ట్రెండ్‌లకు సంబంధించి సెర్చ్ ఫలితాలు హైలెట్ గా నిలిచాయి.
సెర్చ్ రిపోర్ట్ (ref) ప్రకారం , మహా కుంభ్ వంటి జాతీయ కార్యక్రమాలు, భూకంపం, గాలి నాణ్యత కోసం అధికంగా సెర్చ్ చేసారట. 2025 హిట్ సినిమాల్లో 'సయ్యారా', 'లబుబు' వంటి వైరల్ సెన్సేషన్ తో పాటు హీరో ధర్మేంద్ర కూడా ఉన్నారు.
హీరో ధర్మేంద్ర టాప్ 10 మొత్తం సెర్చ్లలో 10వ స్థానంలో, వార్తల కార్యక్రమంలో రెండవ స్థానంలో నిలిచారు. "earthquake near me" అనేది అత్యంత ట్రెండింగ్ "near me" సెర్చ్ కాగా... 'ఫ్లడ్ లైటింగ్' అనేది అత్యంత ట్రెండింగ్ డేటింగ్ సెర్చ్ గా మారింది. 'ఫైనల్ డెస్టినేషన్' సినిమా కోసం కూడా ఎక్కువగా సెర్చ్ చేసారు.
గూగుల్ జెమిని టాప్ ఓవరాల్ సెర్చ్‌లలో రెండవ స్థానంలో నిలిచింది. డీప్‌సీక్, పెర్ప్లెక్సిటీ, చాట్‌జిపిటి, గూగుల్ ఎఐ స్టూడియో, ఫ్లో వంటి టూల్స్ కూడా ఎక్కువగా సెర్చ్ చేయబడ్డాయి. ఇక 'హల్ది ట్రెండ్' సోషల్ ఫీడ్‌లలో ఆధిపత్యం చెలాయించింది.
ప్రతి ఏడాదిలాగానే, ఐపిఎల్ 2025 టాప్ ఓవరాల్ సెర్చ్, టాప్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లిస్ట్‌లలో మొదటి స్థానంలో నిలిచింది. ఆసియా కప్ & ఛాంపియన్స్ ట్రోఫీ కూడా టాప్ 5లో ట్రెండ్ అయ్యాయి.
మహిళల క్రికెట్ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లో భారతదేశ అద్భుతమైన విజయానికి నడిపించిన జెమిమా రోడ్రిగ్స్, టాప్ మహిళాలల్లో మొదటి స్థానంలో ఉండగా... స్మృతి మంధాన, షఫాలి వర్మ వంటి ఇతర క్రికెట్ స్టార్లు కూడా టాప్ ట్రెండింగ్ మహిళల్లో ఉన్నారు.
'కాంతారా' టాప్ సినిమా సెర్చ్‌లలో రెండవ స్థానంలో నిలిచింది. "వాట్ ఈజ్ ఎ లబుబు?" కోసం సెర్చ్‌లు పెరగ్గా, పిల్లలలో ప్రసిద్ధి చెందిన ఈ బొమ్మను వెలుగులోకి తెచ్చింది. కుంభమేళాకు సంబంధించిన గూగుల్ సెర్చ్‌లు కూడా పెరిగాయి.
ఇమేజ్ ఎడిటింగ్ కోసం నానో బనానా ప్రాంప్ట్‌ల కోసం సెర్చ్ లు పెరిగాయి... ఇది "3D మోడల్ ట్రెండ్," "జెమిని saree ట్రెండ్ ప్రాంప్ట్", "కొత్త ఫోటో ట్రెండ్" వంటి ట్రెండ్‌లకు దారితీసింది.
పహల్గామ్ దాడి తర్వాత, 'ఆపరేషన్ సిందూర్' కోసం గూగుల్ సెర్చ్ లు పెరిగాయి. లైవ్ అప్ డేట్స్, అధికారిక ప్రకటనలు తెలుసుకోవడానికి ప్రజలు ఆపరేషన్ సిందూర్ పదాలతో సెర్చ్ ఉపయోగించారు.
అలాగే ప్రజలు పాపులర్ ప్రయాణ గమ్యస్థానాల కోసం కూడా సెర్చ్ చేసారని రిపోర్ట్ పేర్కొంది. ఫిలిప్పీన్స్, ఫుకెట్, పాండిచ్చేరి కూడా లిస్టులో ఉన్నాయి.
టాప్ ట్రెండింగ్ వ్యక్తిత్వంగా రణవీర్ అధిక ఆసక్తిని ఆకర్షించాడు. ప్రజలు అతని గురించి లేటెస్ట్ విషయాలను తెలుసుకోవాలనుకున్నారు. మరోవైపు, ఎంటర్టైన్మెంట్ వ్యక్తుల లిస్టులో సైఫ్ అలీ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు.
పంచాయత్, ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వంటి స్థానిక కథలు భారతీయుల దృష్టిని ఆకర్షించాయి, కానీ 'స్క్విడ్ గేమ్' అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం కోసం కూడా ప్రజలు చాలా సెర్చ్ చేసారు.
స్థానిక వంటకాలు Thekua, Ukadiche Modak కోసం కూడా చాలా శోధించారు. క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 2025లో నంబర్ వన్ ట్రెండింగ్ వ్యక్తిత్వంగా నిలిచారు. మహిళల ప్రపంచ కప్, వక్ఫ్ బిల్ ఈ సంవత్సరం ట్రెండింగ్‌లో ఉండగా X Grok కొత్త AI టూల్స్ పట్ల భారతీయుల ఉత్సుకతను చూసింది. Grok ట్రెండింగ్ సెర్చ్ ఇంకా AI పదంగా ఉద్భవించింది. Yorkshire Pudding ఈ సంవత్సరం అగ్ర వంటకాల లిస్టులో చోటు దక్కించుకోగలిగింది. లక్షలాది మంది హృదయాలను గెలిచినా గాయకుడు Zubeen Garg అతని మరణం తర్వాత ట్రెండింగ్ సెర్చ్ గా మారాడు.
