Dhurandhar 2 Box Office: ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ దుమారం.. 3 రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!

Dhurandhar 2 Box Office: ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ దుమారం.. 3 రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్ తన కెరీర్లో మరో అత్యంత భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఆయన నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద కేవలం వసూళ్ల సునామీనే కాదు, భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది.

ఇండియా ట్రేడ్ వెబ్ సైట్ Sacnilk ప్రకారం, ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ప్రవేశించి ఇండియన్ సినీ చరిత్రలో మరో మైలురాయిని సృష్టించింది. ఇండియాలో రూ.339 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.96 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లుగా వెల్లడించింది.

శనివారం మార్చి 21న ఒక్కరోజే రూ.113 కోట్లు వసూళ్లు చేసి సత్తా చాటింది. ఇవాళ ఆదివారం వీకెండ్ అవ్వడంతో కలెక్షన్స్ మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. దానికితోడు నిన్నటి నుంచి తెలుగు, తమిళ భాషల్లో కూడా మూవీ విడుదల అవ్వడంతో సౌత్ మార్కెట్‌లో కలెక్షన్లు మరింత పెరగనున్నాయి. ఆదివారం రోజునే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇండియా బాక్సాఫీస్ నెట్ కలెక్షన్స్:

తొలి రెండు రోజుల్లో: రూ.226.27 కోట్లు (నెట్)
3వ రోజు వసూళ్లు: రూ.113 కోట్లు
మొత్తం 3 రోజుల కలెక్షన్: రూ.339.27 కోట్లు (నెట్)

ప్రస్తుతం ఈ స్పై థ్రిల్లర్ సినిమాకు భారీ ఆక్యుపెన్సీ నమోదు అవుతోంది. ఈ వేగం చూస్తుంటే, ధురంధర్-2 తొలి వీకెండ్‌లోనే ఇండియాలోనే అత్యధిక ఓపెనింగ్ రికార్డు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ రికార్డు పుష్ప 2 పేరిట ఉంది. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం రూ.354 కోట్లు (ఇండియా నెట్) సాధించింది. ‘ధురంధర్ 2’ అదే రికార్డును అధిగమించే దిశగా దూసుకుపోతోంది.

వరల్డ్‌వైడ్ కలెక్షన్స్:

‘ధురంధర్ 2’ మూడు రోజుల్లో వరల్డ్‌వైడ్ గ్రాస్: రూ.501.04 కోట్లు సాధించింది. ఇది అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

ఇతర భారీ హిట్స్‌ను అధిగమించిన ‘ధురంధర్ 2’:

‘ధురంధర్ 2’ మొదటి రెండు రోజుల కలెక్షన్లలోనే బ్లాక్ బస్టర్ సినిమాలైన జవాన్ రూ.128.23 కోట్లు, పఠాన్ రూ.127.50 కోట్లు, యానిమల్ రూ.130.07 కోట్లు సాధించింది.