పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గణేశ్ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ఆదివారం జిల్లాస్థాయి కరాటే పోటీలను జిల్లా క్రీడల అధికారి పరంధామరెడ్డి, మార్క్ ఫెడ్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కరాటే, కుంగ్ ఫు క్రీడాకారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయన్నారు. ఇటీవల మృతి చెంది న క్రీడాకారుడు డి వెంకట్, విజయ కుమారి పేరిట ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో కేటీ పీఎస్ ఎస్పీఎఫ్ ఆర్ఐ రామారావు, పట్టణ ట్రైనీ ఎస్సై కళ్యాణి, తైక్వాండో జాతీయ క్రీడాకారిణి సింధు తపస్వి, ఒలంపిక్ అసో సియేషన్ ఉపాధ్యక్షులు వై.వెంకటేశ్వర్లు, ప్రణీత్ కుంగ్ ఫు అకా డమీ వ్యవస్థాపకులు టీ.ప్రణీత్, సౌమ్య, శ్రీను, సాయి కృష్ణ, అన్వేశ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, బద్దికిషోర్ కాపర్తి వెంకటాచారి పాల్గొన్నారు.
