- డీఎంహెచ్ వో డాక్టర్ సాయినాథ్ రెడ్డి
వనపర్తి టౌన్, వెలుగు : జిల్లాలో వైద్య సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరూ సీపీఆర్ పై అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ సాయినాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్ బీఎస్ కే మొబైల్ హెల్త్ టీం సభ్యులకు సీపీఆర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ వో మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో గుండెపోటు గురైన రోగి ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ ఎంతో ముఖ్యమన్నారు. అనంతరం సిబ్బందికి డాక్టర్ నాదియా సాదత్ సీపీఆర్ ప్రోటోకాల్ పై సమగ్రంగా అవగాహన కల్పించారు.
