"నువ్వు కొత్త ఉద్యోగం చూసుకో": జర్నలిస్ట్‌పై మండిపడిన డొనాల్డ్ ట్రంప్..

"నువ్వు కొత్త ఉద్యోగం చూసుకో": జర్నలిస్ట్‌పై మండిపడిన డొనాల్డ్ ట్రంప్..

పోలిష్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకితో జరిగిన సమావేశంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఒక పోలిష్ జర్నలిస్ట్ రష్యాపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించడంతో డోనాల్డ్ ట్రంప్ కోపంగా స్పందించారు.  

దింతో ఆ జర్నలిస్టుపై మండిపడుతూ "మీకు చర్యలు తీసుకోవడం లేదని ఎలా తెలుసు ? చైనా తర్వాత రష్యా నుండి అతిపెద్ద చమురు కొనుగోలుదారి అయిన భారతదేశంపై 50 శాతం అదనపు సుంకం విధించడం వల్ల రష్యా వందల బిలియన్ల డాలర్లను కోల్పోయింది. దీన్ని మీరు చర్య కాదని అంటారా ? అని ప్రశ్నించారు.

ట్రంప్ సమాధానం: ఆగస్టు 27 నుండి రష్యా చమురు కొనుగోలుపై భారతదేశంపై 25% పరస్పర సుంకంతో పాటు అదనంగా 25% సుంకం విధించిందని ట్రంప్ ఆగ్రహంగా వివరించారు. ఈ చర్య వల్ల రష్యాకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు.

ఆ తర్వాత ట్రంప్ మరింత కోపంతో నేను ఇంకా రెండవ లేదా మూడవ దశ చర్యలు పూర్తి చేయలేదు. అయినా కూడా మీరు ఎటువంటి చర్య తీసుకోలేదని అనుకుంటే మీరు కొత్త ఉద్యోగం వెతుక్కోవాలని నేను భావిస్తున్నాను" అని ఆ జర్నలిస్ట్‌కు సలహా ఇచ్చారు.