కామన్వెల్త్‌‌‌‌ చెస్‌‌‌‌ చాంపియన్షిప్: ఇనియన్‌‌‌‌కు డబుల్‌‌‌‌ గోల్డ్‌‌‌‌

కామన్వెల్త్‌‌‌‌  చెస్‌‌‌‌  చాంపియన్షిప్: ఇనియన్‌‌‌‌కు డబుల్‌‌‌‌ గోల్డ్‌‌‌‌

న్యూఢిల్లీ: శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్‌‌‌‌ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ఇనియన్‌‌‌‌ పన్నీర్‌‌‌‌సెల్వం డబుల్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ సాధించాడు. ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌ విభాగాల్లో జరిగిన ఏడు రౌండ్లలో ఇనియన్‌‌‌‌ చెరో 6.5 పాయింట్లు సాధించి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. 

ర్యాపిడ్‌‌‌‌లో ఇండియా గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ శ్రీహరి, మిత్రభా వరుసగా సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ను నెగ్గారు. బ్లిట్జ్‌‌‌‌లో రోహిత్‌‌‌‌ కృష్ణ, శ్రీహరి రజతం, కాంస్యం సాధించారు. క్లాసికల్‌‌‌‌ విభాగంలో మిత్రభా స్వర్ణాన్ని కైవసం చేసుకోగా, శ్రీహరి కాంస్యాన్ని సాధించారు.