డెల్టా ప్లస్.. థర్డ్ వేవ్‌కు కారణమవుతుందని చెప్పలేం

డెల్టా ప్లస్.. థర్డ్ వేవ్‌కు కారణమవుతుందని చెప్పలేం

డెల్టా ప్లస్ వేరియంటే థర్డ్ వేవ్ కు కారణమవుతుందని ఇప్పుడే చెప్పలేమన్నారు ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా. అయితే డెల్టా వేరియంట్ నుంచే ఇది మ్యూటెంట్ అయింది కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. డెల్టా వేరియంట్లు వేగంగా వ్యాపిస్తాయన్నారు. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడే కట్టడి చేయాలన్నారు. లేకపోతే సెకండ్ వేవ్ లాగా పరిస్థితి చేయిదాటి పోతుందన్నారు. వేరియంట్ ఏదైనా మనం తీసుకునే జాగ్రత్తలే కీలకమన్నారు గులేరియా. 

చిన్నపిల్లలపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఉండదని మరోసారి చెప్పారు గులేరియా. 2 నుంచి 18ఏళ్లున్న వాళ్లకు వ్యాక్సినేషన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయన్నారు. 2 నుంచి 3నెలల్లో ఫలితాలు వస్తాయన్నారు. ట్రయల్స్ కు వచ్చిన చిన్నారుల్లో సగానికి పైగా మందికి ఆల్ రెడీ యాంటీబాడీస్ ఉంటున్నట్లు గుర్తించామన్నారు. అయితే వారికి కరోనా సోకినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించట్లేదన్నారు. పిల్లల్లో ముందే యాంటీబాడీలు డెవలప్ అవడాన్ని బట్టి చూస్తే థర్డ్ వేవ్ వారిపై పెద్దగా ప్రభావం చూపించబోదన్నారు గులేరియా.