కొందరికి తరుచుగా శరీరం వేడి -చేస్తుంటుంది. మరికొంతమందికి కిడ్నీలలో రాళ్లు వస్తుంటాయి. మరికొంతమందికి జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయరు.వీటన్నిటికి ముఖ్య కారణం శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోవడం. నీటి స్థాయిలు శరీరంలో తగినంత ఉంటే.. ఎలాంటి సమస్యలు దరిచేరవు. కేవలం నీటితోనే కాకుండా మనకు రోజు అందుబాటులో రంగు మిశ్రమాలతో వాటిని నివారించవచ్చు.
కలబందమనిషి ఆయుష్షును పెంచేందుకు ఉపయోగపడుతుందని చాలా మంది వైద్యులు చెప్తున్నారు. కలబందలో విటమిన్స్, ప్రోటీన్స్, క్యాల్షియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. అవి కిడ్నీల్లో రాళ్లను కరిగించేందుకు ఉపయోగపడతాయి.
అలాగే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. మాములుగా వయసు పై బడిన వారిలో జీవకణాలు నశించిపోతాయి. అందువల్ల పలు అనారోగ్యాలు, వృద్ధాప్యం మతిమరుపు వంటి సమస్యలు తలెత్తుతాయి.
మజ్జిగ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసించే మరి అలాంటి మజ్జిగలో కలబందను కలిపి తాగితే అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవి రెండు కలిపి తాగడం వలన రక్తం శుద్ధి అవుతుంది. దాంతో శరీర వేడి కూడా తగ్గుతుంది. కలబంద తరచుగా తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులు రావని ఆరోగ్య నిపుణుల సలహా ఇస్తున్నారు.
–వెలుగు,లైఫ్–
