
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. టీచర్లు, విద్యార్థులు కలిసి వివిధ రంగుల పూలతో బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మ పండుగ విశిష్టతను టీచర్లు విద్యార్థులకు వివరించారు. అనంతరం అందరూ కలిసి ఉత్సహంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతూ సందడి చేశారు. - నెట్వర్క్, వెలుగు