2024 ఎన్నికలకు కసరత్తు..పాన్ ఇండియా లెవల్లో తనిఖీలు

2024 ఎన్నికలకు కసరత్తు..పాన్ ఇండియా లెవల్లో తనిఖీలు

2024 సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు, సాంకేతిక లోపాలు సరిద్దిదేందుకు నడుం భిగించింది. ఇందులో భాగంగా పాన్ ఇండియా ఎక్సర్ సైజ్ ను ప్రారంభించింది.  ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM), పేపర్ ట్రైల్ మెషీన్ ల ఫస్ట్ లెవల్ తనిఖీలను ప్రారంభించింది. దశలవారీగా ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఫస్ట్ లెవల్ చెకింగ్స్ లో భాగంగా మాక్ పోల్స్ చేపట్టనుంది. ఇందులో భాగంగా ముందుగా  కేరళలోని అన్ని నియోజకవర్గాలతో సహా దశలవారీగా దేశ వ్యాప్తంగా ఫస్ట్ లెవల్ చెకింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 

ఐదు రాష్ట్రాల్లో తనిఖీలు

రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌తో పాటు ఉప ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల్లో కూడా ఫస్ట్ లెవల్ తనిఖీలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.  ప్రస్తుతం, వాయనాడ్, పూణే, చంద్రపూర్ (మహారాష్ట్ర), ఘాజీపూర్ (ఉత్తరప్రదేశ్),అంబాలా (హర్యానా) లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ముందుగా మాక్ పోలింగ్ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.

ఫస్ట్ లెవల్ చెకింగ్ ఎందుకు చేస్తారు. 

EVMతో పాటు పేపర్ ట్రైల్ మెషిన్ ల పరికరాలను BEL, ECIL ఇంజనీర్ల సమక్షంలో తనిఖీలు నిర్వహిస్తారు. వాటిలో ఏమైనా లోపాలు తలెత్తితే వెంటనే మరమ్మత్తు, లేదా వాటి స్థానంలో కొత్త వాటిని తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది.  రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రెండు యంత్రాలను తనిఖీ చేసేందుకు మాక్ పోల్ కూడా నిర్వహిస్తారు. 

2024 సార్వత్రిక ఎన్నికలను ఏప్రిల్ 2024 లేదా మే 2024లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. 18వ లోక్‌సభ సభ్యుల పదవీకాలం 16 జూన్ 2024తో ముగియనుంది. ఈ లోపే ఎన్నికలను నిర్వహించాలని అనుకుంటోంది. ఇక 2019 సాధారణ ఎన్నికలు ఏప్రిల్- మే 2019లో జరిగాయి.