సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్న భారత మహిళల హాకీ జట్టు

సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్న భారత మహిళల హాకీ జట్టు

ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. 16 ఏళ్ల తర్వాత ఈ ఈవెంట్‌లో మహిళల జట్టుకు ఇదే తొలి పతకం. ఈ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయతో పాటు.. ఇప్పుడు మరో విషయం కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది. అదేంటంటే, కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత భారత మహిళల జట్టు తమ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఈ వైరల్ వీడియోలో బృందం తమ డ్రెస్సింగ్ రూమ్‌లో 'సునో గౌర్ సే దునియా వాలోన్' పాటకు పరవశించిపోయి, ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని గమనించవచ్చు. టీమ్ అంతా తమ ఆనందాన్ని దాచుకోలేక దేశభక్తి గీతానికి అనుగుణంగా గంతులేస్తూ.. ఆనందంతో  నృత్యాలు చేస్తూ కనిపించారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారి...  దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.