ఎడ్సెట్ సెకండ్ ఫేజ్లో 7,441మందికి సీట్లు

ఎడ్సెట్ సెకండ్ ఫేజ్లో 7,441మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్​సెట్​ సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్​మెంట్ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటాలో 10,005 సీట్లు అందుబాటులో ఉండగా, 12,076 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 

దీంట్లో 7,441 మందికి సీట్లు కేటాయించినట్టు  అడ్మిషన్ల కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 18లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. కాగా, ఫస్ట్ ఫేజ్​లో 9,955 మందికి సీట్లు అలాట్ కాగా.. వారిలో 4,474 మంది మాత్రమే కాలేజీల్లో రిపోర్టు చేశారు.