ENG vs IND 2025: టీమిండియాతో రెండో టెస్ట్.. స్క్వాడ్‌ను ప్రకటించిన ఇంగ్లాండ్

ENG vs IND 2025: టీమిండియాతో రెండో టెస్ట్.. స్క్వాడ్‌ను ప్రకటించిన ఇంగ్లాండ్

టీమిండియాతో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో గెలిచి ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇండియాపై ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్టుకు వారం రోజుల గ్యాప్ ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా బుధవారం (జూలై 2) భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన స్క్వాడ్ ను ప్రకటించింది. జట్టులో కొత్తగా ఫాస్ట్ బౌలర్ ను ఆర్చర్ ను చేర్చింది. మిగిలిన జట్టును అలాగే ఉంచింది. అంతకముందు ఉన్న 14 మంది ప్రాబబుల్స్ లో ఎవరినీ తప్పించలేదు.    

ఆర్చర్ వచ్చేశాడు.. వేటు ఎవరిపై..?

స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులోకి వచ్చాడు. ఆర్చర్ 2021లో అహ్మదాబాద్‌లో టీమిండియాతో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయాలతో చాల టెస్ట్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఆర్చర్ ప్లేయింగ్ 11 లోకి రావడం దాదాపు గ్యారంటీగా మారింది. అయితే ఈ పేసర్ ఎవరి స్థానంలో వస్తాడనే సస్పెన్స్ కొనసాగుతోంది. జోస్ టంగ్ లేదా బ్రైడాన్ కార్సే స్థానంలో ప్లేయింగ్ 11 లో ఆడే ఛాన్స్ ఉంది. తొలి టెస్టులోకి టంగ్ నాలుగు వికెట్లతో రాణించగా.. కార్సే  పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో కార్స్ పై వేటు పడడం ఖాయంగా కనిపిస్తుంది. 

ALSO READ | SL vs BAN: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ వదిలి వెళ్లిపోయిన అంపైర్

నాలుగేళ్ల తర్వాత ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. బొటన వేలి గాయం నుంచి కోలుకొని ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మ్యాచ్ ఆడాడు. చెస్టర్-లె-స్ట్రీట్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ లో భాగంగా డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ తరపున ఈ స్పీడ్‌స్టర్ 14 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మే 2021 తర్వాత ఆర్చర్ తన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడడం విశేషం. ఈ మ్యాచ్ లో ఇబ్బందిపడకుండా బౌలింగ్ చేసిన ఈ ఇంగ్లాండ్ పేసర్.. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఈ స్పెల్ తో తాను రెండో టెస్టుకు రెడీ అని సంకేతాలు ఇచ్చాడు.   

టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు:

బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్