కొత్త మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్ అందించాలి : నర్సింహారెడ్డి

కొత్త మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్ అందించాలి : నర్సింహారెడ్డి
  • అధికారులకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న కేజీబీవీల్లోని పిల్లలకు కొత్త మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఆదేశించారు. మంగళవారం కేజీబీవీల్లో పని చేస్తున్న వంట సిబ్బందికి కొత్త మెనూ, వంట చేసేటప్పుడు పాటించాల్సిన అంశాలపై విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇచ్చారు.

 31 జిల్లాల నుంచి 93 మంది సిబ్బంది పాల్గొనగా.. వారంతా జిల్లాలోని అన్ని కేజీబీవీ సిబ్బందికి వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఈవీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ..విద్యార్థినులకు సరైన వయస్సులో సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు.