'బేబీ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

'బేబీ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆనంద్ దేవరకొండ(ananddeverkonda), విరాజ్ అశ్విన్( viraj ashwin)  హీరోలుగా క్యూట్ లవ్ స్టొరీతో  వస్తున్న మూవీ బేబీ(Baby). ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులని అలరించాయి. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసేందే. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వచ్చే నెల (జులై 14న) ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.  కాన్సెప్ట్ ఇంటరెస్టింగ్ గా ఉన్న పోస్టర్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులారిటీ సొంత్య చేసుకున్న వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ఈ మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది

కలర్ ఫోటో సినిమాకు కథ స్క్రీన్ ప్లే  అందించిన సాయి రాజేష్(SaiRajesh) బేబీ మూవీకు దర్శకత్వం వహించడం ఆసక్తి పెంచుతుంది. ఈ మూవీ లో  డీగ్లామర్ గా ఉండే ఒక అమ్మాయిని ఇష్టపడే అబ్బాయిగా ఆనంద్ దేవరకొండ నటించారు. ఈ మూవీతో ఆనంద్ దేవరకొండ ఖాతాలో హిట్ పడటం గ్యారంటీ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు. 

 ఓ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించిన ఈ మూవీకు విజయ్‌ బుల్గానిన్(VijaiBulganin) మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ మూవీను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై దాసరి వెంకట సతీష్‌ నిర్మిస్తున్నాడు. .