ఎన్​డీఎస్ఏ రిపోర్టుపై ఏం చేద్దాం : మంత్రి ఉత్తమ్

 ఎన్​డీఎస్ఏ రిపోర్టుపై ఏం చేద్దాం : మంత్రి ఉత్తమ్
  • వెదిరె శ్రీరాంతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ

హైదరాబాద్, వెలుగు:మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం నిపుణుల సలహాలు తీసుకుంటున్నది. బ్యారేజీ పునరుద్ధరణ, రక్షణ చర్యలు, రిపేర్ల వంటి అంశాలపై కసరత్తు మొదలు పెట్టింది. మంగళవారం సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ మర్యాదపూర్వకంగా భేటీ అయినట్టు తెలిసింది. ఈ సందర్భంగా వారి మధ్య మేడిగడ్డపై ఎన్​డీఎస్ఏ ఇచ్చిన తుది నివేదికపై చర్చకు వచ్చినట్టు సమాచారం. 

రిపోర్టులోని అంశాలు, అందులో ముడిపడి ఉన్న సాంకేతికతలపై కాసేపు చర్చించినట్టు తెలిసింది. ఏడో బ్లాకును పూర్తిగా తొలగించాలని ఎన్​డీఎస్ఏ రిపోర్టులో పేర్కొన్న నేపథ్యంలో.. మేడిగడ్డను పునరుద్ధరించేందుకు ఏం చేయాలి? మేడిగడ్డ కాకుండా ప్రత్యామ్నాయాలు ఏంటి? వంటి అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. రిపేర్లు చేశాక బ్యారేజీలో ఎంత మేర స్టోర్ చేయాలన్నదానిపైనా చర్చించినట్లు సమాచారం. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే వచ్చే ప్రయోజనాలు, ఇతర అంశాలనూ చర్చించినట్టు తెలిసింది. కాగా, రిపోర్టులోని అంశాల ఆధారంగా ఇరిగేషన్ డిపార్ట్​మెంట్ అధికారులు, ఇతర టెక్నికల్ నిపుణులతో సమావేశమై ఎలా ముందుకెళ్లాలన్నదానిపైన చర్చించే అవకాశముంది.