జిరాక్స్ సెంటర్లో వాహనపత్రాలు తయారీ..

జిరాక్స్ సెంటర్లో వాహనపత్రాలు తయారీ..

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మన్నెగూడలో ఉన్న రవాణా శాఖ కార్యాలయం వద్ద ఆరుగురు అర్టీఏ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వాహనాల పత్రాలు తయారు చేస్తుండగా ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, గ్యాస్ బిల్లులు, బ్యాంక్ ఎన్వోసీలు, పోలీస్ మిస్సింగ్ సర్టిఫికెట్లు, వాహన స్పీడ్ లిమిట్ సర్టిఫికెట్లు, ఫేక్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, రెండు లాప్టాప్ లు, పెన్ డ్రైవ్ లు,  రూ.18 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

ఆర్టీవో కార్యాలయానికి సమీపంలోని లక్షిత అను పేరుతో  జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేసి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంగిరెడ్డి రాఘవేంద్రారెడ్డితో పాటు మరో ఐదుగురు ఆదివెట్టి వేణు, అనుపటి శ్రీశైలం, చాపల యాదగిరి, కొంగల ఆనంద్ కుమార్, పొట్టబతిన శ్రీధర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.