యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం ఆగేలా లేదు. ఫార్మాట్ ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. ప్రత్యర్థి ఎవరైనా విధ్వంసం సృష్టించడం కామన్. ఐపీఎల్ 2025 నుంచి కొనసాగుతున్న ఈ 14 ఏళ్ళ కుర్రాడి విధ్వంసం ఇప్పటికీ తగ్గలేదు. ఓపెనర్ గా బరిలోకి దిగిన వెంటనే కొత్త బంతితో సంబంధం లేకుండా.. స్టార్ బౌలర్ తో పని లేకుండా తొలి బంతి నుంచే బౌండరీల వర్షం కురించడం సూర్యవంశీకే చెల్లింది. తాజాగా ఈ టీనేజ్ కుర్రాడు అండర్-19 క్రికెట్ లో సౌతాఫ్రికాపై అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. తాను ఎదుర్కొన్న తొలి 10 బంతుల్లో ఏకంగా 6 సిక్సర్లు బాది ఆశ్చర్యానికి గురి చేశాడు.
అండర్-19 సిరీస్ లో భాగంగా సోమవారం (జనవరి 5) సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో వైభవ్ చెలరేగి ఆడుతున్నాడు. బెనోని వేదికగా విల్లోమూర్ పార్క్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో వీర ఉతుకుడు ఉతుకుతున్నాడు. కేవలం సిక్సర్లతోనే డీల్ చేస్తున్నాడు. 246 పరుగుల ఛేజింగ్ లో తొలి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించిన వైభవ్ సూర్యవంశీ.. తాను ఎదర్కొన్న తొలి 10 బంతుల్లోనే 6 సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. ప్రస్తుతం 13 బంతుల్లోనే 37 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నాడు. మరి ఈ మ్యాచ్ లో వైభవ్ విధ్వంసం ఎంతవరకు సాగుతుందో చూడాలి.
Also Read : వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ప్రయోగం.. వికెట్ కీపర్‌గా మ్యాక్స్‌వెల్
సూర్యవంశీ విధ్వంసంతో ఛేజింగ్ లో ఇండియా వికెట్ కోల్పోకుండా 5 ఓవర్లలోనే 58 పరుగులు చేసింది. క్రీజ్ లో సూర్యవంశీ (37), జార్జి ఉన్నాడు. టీమిండియా విజయానికి 45 ఓవర్లలో 188 పరుగులు వసరం. చేతిలో 10 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ లో భారత కుర్రాళ్ల జట్టు గెలవడం ఖాయంగా మారింది. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.
Vaibhav Suryavanshi is batting on 37*(10). He has hit 6 sixes in only 10 balls. pic.twitter.com/MZg5MoZrgl
— Varun Giri (@Varungiri0) January 5, 2026
