వాళ్లు వీళ్లే : తెలంగాణ మావోయిస్టులు మిగిలింది 17 మంది మాత్రమే

వాళ్లు వీళ్లే : తెలంగాణ మావోయిస్టులు మిగిలింది 17 మంది మాత్రమే

అతి త్వరలో తెలంగాణ రాష్ట్రం మావోయిస్ట్ రహితంగా మారబోతున్నది.. అవును.. ఇది నిజం. పోలీసులు ఇదే చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేవలం 17 మంది మాత్రమే.. ఇప్పుడు మావోయిస్టుల్లో ఉన్నారని.. వాళ్లు లొంగిపోతే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు మావోయిస్టుల్లో ఉండరని స్పష్టం చేస్తున్నారు పోలీసులు. 

ఈ 17 మంది తెలంగాణ మావోయిస్టుల్లో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, ఐదుగురు స్టేట్ కమిటీ సభ్యులు.. ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారని.. మరొకరు అండర్ గ్రౌండ్ లో ఉన్నట్లు ప్రకటన విడదల చేశారు పోలీసులు. వీళ్లందరూ లొంగిపోవాలని డీజీపీ శివథర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ పూర్తయ్యేలోపు లక్ష్యం సాధించే దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు పోలీస్ బాస్ శివథర్ రెడ్డి. 

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 17 మంది మావోయిస్టుల ప్రొఫైల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయని.. వీరిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు స్పష్టం చేశారాయన. ఈ 17 మంది మావోయిస్టులపై 2 కోట్ల 25 లక్షల రూపాయల రివార్డ్ ఉన్నట్లు వెల్లడించారాయన. 

►ALSO READ | సింగరేణి ఉద్యోగులతో పెద్దపల్లి వంశీ కృష్ణ.. ఐటీ మినహాయింపు కోసం సీఎంతో మాట్లాడతా..!

మావోయిస్టుల సెంట్రల్ కమిటీలో ముప్పాల లక్ష్మణ్ రావ్ అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ఉన్నారు. 

స్టేట్ కమిటీ విషయానికి వస్తే ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, వార్త శేఖర్ అలియాస్ మంగుత్, జోడే రత్నా భాయ్, నక్కా సుశీల, లోకేటి చంద్రశేఖర్, దామోదర్ ఉన్నారు. 

ఇక డివిజన్ కమిటీ విషయానికి వస్తే రాజేశ్వరి, రంగబోయిన భాగ్య, బాడిషా ఉంగా, సంగీత, భవానీ, మైసయ్య, * భగత్ సింగ్ ఉన్నారు.