అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు

అమెరికాలో హై టెన్షన్. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. తుపాకీ కాల్పులకు జేడీ వాన్స్ ఇంటి కిటికీ అద్దాల్లో నుంచి బుల్లెట్లు ఇంట్లోకి దూసుకొచ్చాయి. విలియం హోవార్డ్ టాఫ్ట్ డ్రైవ్ లోని ఒహియో ఇంటిపై ఈ కాల్పులు జరిగాయి. ఘటన జరిగిన సమయంలో జేడీ వాన్స్, ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ ఆ ఇంట్లో లేరు. 2026, జనవరి 5వ తేదీ తెల్లవారుజామున ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు చెబుతున్నారు పోలీసులు.

ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు వెంటనే స్పందించారు. జేడీ వాన్స్ ఇంటి సమీపంలో సంచరిస్తున్న ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నారు. జేడీ వాన్స్ ఇంట్లోకి ఆ వ్యక్తి వెళ్లాడా లేదా అనేది నిర్థారించలేదు పోలీసులు.

భద్రతా సిబ్బంది అదుపులో ఉన్న వ్యక్తిని విచారిస్తున్నామని.. విచారణ తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించింది ఫెడరల్ లా ఎన్స్ ఫోర్స్ మెంట్. జేడీ వాన్స్ ను ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా అనే విషయంపైనా స్పష్టం ఇవ్వటం లేదు అధికారులు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటి కిటికీ అద్దాల్లో నుంచి బుల్లెట్లు దూసుకెళ్లిన ఆనవాళ్లు కనిపించటం ఇప్పుడు మీడియాలో సంచలనంగా మారింది.