ఫార్మాలో భద్రతపై సమావేశం నిర్వహించిన సీఐఐ

ఫార్మాలో భద్రతపై సమావేశం నిర్వహించిన  సీఐఐ

హైదరాబాద్, వెలుగు: ఫార్మా, కెమికల్​ కంపెనీల్లో పారిశ్రామిక భద్రతపై అవగాహన పెంచడం కోసం కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)తెలంగాణ తన మొదటి సమావేశం "పిల్లర్స్ అఫ్ ప్రొటెక్షన్ – ఫోర్జింగ్ సఫర్ ఫ్యూచర్ ఫర్ ఫార్మా అండ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్" ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టర్​జనరల్  వై. నాగిరెడ్డి మాట్లాడుతూ భవన డిజైన్ లోపాలు లేదా భద్రతా వ్యవస్థలు పనిచేయకపోవడం వల్ల ప్రమాదాలు జరగవచ్చని అన్నారు. 

ఇండస్ట్రీ అయినా, సామాన్యుడైనా భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.  ఫార్మా పరిశ్రమల్లో ఏటా తప్పకుండా అగ్ని భద్రతా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఇండస్ట్రీలు స్వచ్ఛందంగా తనిఖీలు జరిపించి, ఆ వివరాలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో సమర్పించాలని సూచించారు. గత దశాబ్దంలో ఫార్మా పరిశ్రమల్లో 102 పెద్ద అగ్నిప్రమాదాలు సంభవించగా, రూ.100 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది.

 ఈ సందర్భంగా ఫార్మాక్సిల్​ డైరెక్టర్‌‌ ​జనరల్ ​రాజభాను మాట్లాడుతూ మన ఫార్మా ఎగుమతులు ప్రస్తుతం 30 బిలియన్ డాలర్లు కాగా, 2030 నాటికి 70 బిలియన్ డాలర్లకు చేరుతాయని వెల్లడించారు. 2047 నాటికి 450 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు లక్ష్యంగా ఇండస్ట్రీ పనిచేయాలని సూచించారు.