
వెల్గటూర్, వెలుగు: అప్పుల బాధతో రైతు సూసైడ్ చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కిషన్ రావుపేట్ గ్రామానికి చెందిన మాచర్ల లక్ష్మణ్యాదవ్(45) జీవనోపాధి కోసం దుబాయ్ కు వెళ్లాడు. ఉపాధి దొరకక కొన్ని రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వ్యవసాయ పెట్టుబడుల కోసం పలువురి వద్ద అప్పు చేశాడు. దీనికి తోడు రెండేళ్లుగా పం టల దిగుబడి సరిగా లేదు. పంటలో నష్టాలు రావడం, అప్పులు పెరిగిపోవడంతో గురువారం పురుగుల మందు తాగాడు. కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా శనివారం చనిపోయాడు.