
పరకాల, వెలుగు: రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. ఆదివారం పరకాలలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలాలవారీగా డిమాండ్‌కు తగినంత యూరియా సరఫరా చేయాలన్నారు. టోకెన్ పద్ధతిలో స్టాక్‌ను బట్టి రైతులకు బస్తాలు అందించాలన్నారు.
ఇప్పటికే రావాల్సినంత కోటా వచ్చిందని, సకాలంలో పంపిణీ చేసి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అంతకుముందు పట్టణకేంద్రంలోని అంగడి మైదానంలో జరిగే బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. బతుకమ్మ ఆడుకునే మహిళలకు అన్నిరకాల వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట టౌన్ ప్రెసిడెంట్కొయ్యడ శ్రీనివాస్, మండల ప్రెసిడెంట్కట్కూరి దేవేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ రాజేశ్వర్‌రావు ఉన్నారు.