70వ రోజుకు  గొల్లపల్లి,చీర్కపల్లి రైతుల నిరసనలు

70వ రోజుకు  గొల్లపల్లి,చీర్కపల్లి రైతుల నిరసనలు

రేవల్లి,వెలుగు:  కడుపుకోత మిగిల్చే ప్రాజెక్టు వద్దని ఏదుల మండలంలోని గొల్లపల్లి,చీర్కపల్లి రైతులు చేస్తున్న పోరాటం ఆదివారంతో 70వ రోజుకు చేరింది. తమ ఊపిరి ఉన్నంత వరకు తమ భూములను వదులుకోమంటూ   అఖిలపక్ష నేతలతో కలిసి రైతులు  ధర్నా కొనసాగిస్తున్నారు.  ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టును విరమించుకోవాలని  డిమాండ్​ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సుమారు 1,352ఎకరాల సాగుభూమి నీటమునిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా  ప్రజాప్రతినిధులు, ఇటు ఉన్నతాధికారులు కన్నెత్తి చూడకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొండివైఖరి వీడకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ, ప్రతిపాదించిన ప్రాజెక్టు జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.