- హనుమకొండ జిల్లా భీమారంలో ఘటన
హసన్ పర్తి, వెలుగు: ఆ ఇంట్లో పెండ్లై వారం రోజులైంది. పెండ్లి సందడి కూడా ఇంకా పూర్తి కాలే.. అప్పుడే విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో పెండ్లి కొడుకుతోపాటు తండ్రి కూడా చనిపోయిన ఘటన మంగళవారం హనుమకొండ జిల్లా భీమారంలో జరిగింది. గ్రామస్తులు వివరాల ప్రకారం భీమారం గ్రామానికి చెందిన ఉప్పు సాంబయ్య (61) రిటైర్డ్ ఉద్యోగి, అతని కొడుకు శరత్ కుమార్(32) హైదరాబాద్‌లో చార్టెడ్ అకౌంటెంట్.
ఇతనికి వారం కింద(జూన్ 24న) పెండ్లయింది. మంగళవారం సాయంత్రం వర్షం పడింది. సాంబయ్య ఇంటి వద్ద ఉన్న బల్బు వెలుగకపోవడంతో చెక్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. పక్కనే ఉన్న శరత్ తండ్రిని కాపాడబోయి షాక్‌కు గురయ్యాడు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యలు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.
