ఫిల్మ్ నగర్లో విషాదం..రెండేళ్ల బాలుడితో కలిసి ఉరేసుకున్న తల్లి

 ఫిల్మ్ నగర్లో విషాదం..రెండేళ్ల బాలుడితో కలిసి ఉరేసుకున్న తల్లి

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక కుమారుడు తో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. 

వినాయక నగర్ లోవిశ్వనాథ్, శిరీష దంపతులు  నివాసం ఉంటున్నారు. వీరికి రెండున్నర ఏళ్ల బాలుడు మనీష్. అయితే అత్తింటి వేధింపులు భరించలేక కుమారుడు మనీష్కి ఉరి వేసిన శిరీష తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శిరీష ప్రస్తుతం మూడు నెలల గర్భిణి అని పోలీసులు తెలిపారు.