
ఏటూరు నాగారం, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు ఆదివాసీ బిడ్డ ఉన్నత విద్యకు అడ్డంకిగా మారాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లికి చెందిన దబ్బగట్ల నాగేశ్వర్ రావు, గంగాదేవిల చిన్న కూతురు సమ్మక్క. ఏటూరునాగారంలోని ట్రైబల్గర్ల్స్రెసిడెన్షియల్ స్కూల్లో 5 నుంచి పదో తరగతి, టీటీడబ్ల్యూఆర్ జేసీలో ఇంటర్ పూర్తి చేసింది. ఇంటిదగ్గరే ఉంటూ జేఈఈ పరీక్షలకు ప్రిపేరై.. 4,165 ర్యాంక్ సాధించింది. చత్తీస్గఢ్స్టేట్లోని రాయపూర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్టెక్నాలజీలో మైనింగ్ఇంజనీరింగ్ సీటు వచ్చింది. అయితే నాగేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. స్కాలర్షిప్ట్యూషన్ఫీజుకు సరిపోయినా.. మెస్ బిల్, స్టడీ మెటీరియల్ ఇతర అవసరాలను డబ్బులు లేకపోవడం ఆమె చదువుకు ఆటంకంగా మారింది. విషయం తెలిసి ఏటూరునాగారం మండలం ఆకులవారిఘనపూర్ లోని ట్రైబల్గర్ల్స్రెసిడెన్షియల్స్కూల్ హెచ్ఎం రేవతి, వార్డెన్ శ్రీలత, టీచర్లు ఉషారాణి, అరుణ, సాంబయ్య, చెంచయ్య, ప్రభ, శ్యామలత, అర్చన చందాలు వేసుకుని తమ స్కూలు ఓల్డ్ స్టూడెంట్అయిన సమ్మక్కకు రూ. 11వేల సాయం అందించారు. దాతలు ముందుకొచ్చి సమ్మక్కకు సాయం చేయాలని వారు కోరారు.