
బతుకమ్మ వేడుకల్లో భాగంగా తెలంగాణలోని పల్లెలు, పట్టణాల్లో బొడ్డెమ్మ సంబురాలు మొదలయ్యాయి. బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు నిర్వహించే ఈ వేడుకల్లో మహిళలు పాటలు పాడుతూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ వరకు బొడ్డెమ్మను జరుపుకొని అనంతరం నిమజ్జనం చేయనున్నారు. నేటి యువతకు బతుకమ్మ తప్ప బొడ్డెమ్మ పండుగ ఒకటి ఉంటుందనే విషయం తెలియకుండా పోవడంతో కరీంనగర్లో ని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ వేడుకలు నిర్వహించి, అవగాహన కల్పిస్తున్నారు. - కరీంనగర్, వెలుగు