లోక్‌‌‌‌ అదాలత్‌‌‌‌లో 11 లక్షల కేసులు పరిష్కారం

 లోక్‌‌‌‌ అదాలత్‌‌‌‌లో 11 లక్షల కేసులు పరిష్కారం
  • రూ. 595 కోట్ల పరిహారం చెల్లింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన లోక్‌‌‌‌ అదాలత్​లో 11.08 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో ప్రీలిటిగేషన్‌‌‌‌  కేసులు 3.63 లక్షలు, కోర్టుల్లో పెండింగ్‌‌‌‌ ఉన్నవి 7.43 కేసులు చొప్పున ఉన్నాయి. కేసులను ఉభయ పక్షాలు పరిష్కరించుకోవడం వల్ల లబ్ధిదారులకు రూ.595 కోట్లను పరిహారంగా చెల్లింపు ఉత్తర్వులు వెలువడ్డాయని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్‌‌‌‌  పంచాక్షరి ప్రకటించారు. 

రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌‌‌‌  చైర్మన్‌‌‌‌  జస్టిస్‌‌‌‌  పి.శ్యాంకోశి, హైకోర్టు లీగల్‌‌‌‌  సర్వీసెస్‌‌‌‌  కమిటీ చైర్మన్‌‌‌‌  జస్టిస్‌‌‌‌  మౌసమీ భట్టాచార్య ఆధ్వర్యంలో లోక్ అదాలత్  జరిగిందని చెప్పారు. ఇక రోడ్డు ప్రమాద బాధితుడికి భారీ మొత్తంలో పరిహారం చెల్లింపు ఉత్తర్వులు వెలువడ్డాయి. ట్రైబ్యునల్‌‌‌‌  ప్రకటించిన రూ.98. 30 లక్షల పరిహారాన్ని 8 శాతం వడ్డీతో రూ.1.20 కోట్లు చెల్లించేందుకు న్యూ ఇండియా అష్యూరెన్స్‌‌‌‌  కంపెనీ అంగీకరించింది. ప్రమాదం జరిగిన జరిగిన 9 ఏళ్లకు బీటెక్‌‌‌‌  విద్యార్థి పవన్‌‌‌‌ కుమార్‌‌‌‌కు ఈ సాయం అందింది.