కలియుగ షణ్ముఖ .. చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్

 కలియుగ షణ్ముఖ .. చిత్రం నుంచి  ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్

ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా ష‌‌‌‌ణ్ముగం సాప్పని రూపొందిస్తున్న  చిత్రం ‘షణ్ముఖ’. తుల‌‌‌‌సీరామ్, రమేష్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నుంచి  ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ‘కలియుగ షణ్ముఖుని కథను చూసేందుకు సిద్ధంగా ఉండండి’ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా ఆది కనిపిస్తుంటే, అతని పక్కన అవికా గోర్ భయపడుతూ నిల్చొని ఉంది.

వెనకాల షణ్ముఖ సుబ్రహ్మాణ్య స్వామి కనిపించడం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఇదొక డివోషనల్ థ్రిల్లర్ అని,  ఇప్పటివ‌‌‌‌ర‌‌‌‌కు ఎవ‌‌‌‌రూ ట‌‌‌‌చ్ చేయ‌‌‌‌ని  పాయింట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు ష‌‌‌‌ణ్ముగం సాప్పని  చెప్పాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాతలు అన్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.