Fish Curry Receipe : చింత చిగురుతో చేపల పులుసు.. ఇంట్లోనే 20 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు..

Fish Curry Receipe : చింత చిగురుతో చేపల పులుసు.. ఇంట్లోనే 20 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు..

పుర్రెకో బుద్ది..జిహ్వకో రుచి అన్నారు.  రోజూ వెరైటీ ఫుడ్​ కావాలంటారు.  కొంతమంది పాత కూర తినాలంటే మొహం చాటేస్తారు.  అందుకే సీజన్​ ఫుడ్​ కు చాలామంది ఇష్ట పడుతుంటారు.  చేపలు ఎప్పుడూ మార్కెట్​లో దొరుకుతూనే ఉంటాయి.  చేపలతో ఈ సీజన్​ లో వెరైటీ ఫుడ్​ తయారు చేసుకోవచ్చు.. చేపల పులుసులో కొద్దిగా చింతచిగురును వేస్తే ఇక   ఆ పులుసును లొట్టలేసుకుంటూ తినాల్సిందే.. అంతటి కమ్మని రుచిగల చింత చిగురు పులుసును ఎలా తయారు చేయాలోతెలుసుకుందాం...

Also Read:-చిన్న ప్లేట్.. బుల్లి కంచంలో తింటే బరువు తగ్గిపోతారా.. ఏంటీ సూత్రం.. ఏంటీ విధానం..?

చింతచిగురు చేపల పులుసు తయారీకి కావాల్సినవి 

  • చేపలు: అర కిలో
  • చింత చిగురు: ఒక కప్పు
  • కారం: ఒక టీ స్పూన్
  • నూనె: నాలుగు టీ స్పూన్లు
  • ఉల్లి తరుగు: అర కప్పు
  • పచ్చిమిర్చి: రెండు టీ స్పూన్లు
  • అల్లం, వెల్లుల్లి ముద్ద: మూడు టీ స్పూన్లు
  • చింతపండు గుజ్జు: మూడు టీ స్పూన్లు
  • గరం మసాలా: ఒక టీ స్పూన్ 
  • మెంతికూర: అర కప్పు
  • పసుపు: అర టీ స్పూన్
  • ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం: ఒక గిన్నెలో పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చేపలకు పట్టించాలి. పాన్​ లో  కొద్దిగా నూనె వేసి ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేగించాలి. తర్వాత మెంతికూర వేసి బాగా కలపాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగించాలి. ఈ మిశ్రమంలో చేప ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. చింతపండు రసం, కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరిగా చింతచిగురు వేసి కొద్ది సేపు ఉడికించాలి. గరంమసాలా వేసి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి

–వెలుగు,లైఫ్​‌‌–