Good Health : చిన్న ప్లేట్.. బుల్లి కంచంలో తింటే బరువు తగ్గిపోతారా.. ఏంటీ సూత్రం.. ఏంటీ విధానం..?

Good Health : చిన్న ప్లేట్.. బుల్లి కంచంలో తింటే బరువు తగ్గిపోతారా.. ఏంటీ సూత్రం.. ఏంటీ విధానం..?

అధిక బరువు ఉన్న వాళ్లు బరువు తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దీని కోసం ఎక్కువ మంది డైటింగ్ ఫాలో అవుతుంటారు. ఇది కొంచెం కష్టమైన విషయం. కానీ, ఒక చిన్న టెక్నిక్ బరువు తగ్గొచ్చంటున్నారు పరిశోధకులు. 

తినే ప్లేటు సైజు తగ్గించుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.  ఇలా చేయడం వల్ల పొట్ట భాగంలో పేరుకుపోయిన అధిక కొవ్వు తగ్గుముఖం పడుతుంది. పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల డయాబెటిస్, కేన్సర్ వంటి జబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. 


 బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఎక్కువ పరిమాణం ఉన్న ప్లేటుతో పోలిస్తే తక్కువ పరిమాణం ఉన్న ప్లేట్​లోనే భోజనం చేయాలి. పదకొండు అంగుళాల పరిమాణం ఉన్న ప్లేట్​ తో  పోలిస్తే.. పది అంగుళాల ప్లేట్ లో తక్కువ ఆహారం తీసుకుంటారని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. 

 పొట్ట పెరిగిపోయిన వాళ్లు చిన్న ప్లేట్లలో ఆహారం తీసుకుంటే పొట్ట సైజు తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. సాధారణంగా ఆహారం తీసుకునేటప్పుడు కడుపు నిండినట్లు అనిపించడానికి ఇరవై నిమిషాల సమయం పడుతుంది. పెద్ద ప్లేట్ లో నిండుగా ఆహారం పెట్టుకొని తినడం వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ తింటాం. చిన్నప్లేట్​లో  ఆహారం తీసుకోవడంతోపాటు.. ఆరోగ్యకరమైన... సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు. బరువు తగ్గాలని అనుకునేవారు ముఖ్యంగా జంక్ ఫుడ్​ను  పక్కనబెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు..

–వెలుగు,లైఫ్​‌‌–