తొర్రూరు, వెలుగు: ప్రతి విద్యార్థి తరగతి స్థాయి నుంచే సైన్స్ పై అవగాహన కలిగి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని తొర్రూరు ఎంఈవో మహంకాళి బుచ్చయ్య అన్నారు. బుధవారం జనవిజ్ఞాన వేదిక తొర్రూరు మండల కమిటీ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేశ్ గౌడ్ అధ్యక్షతన, జిల్లా ఉపాధ్యక్షుడు రాయిపల్లి యాకయ్య సమన్వయంతో తొర్రూరు హైస్కూల్లో చెకుముకి టాలెంట్ టెస్ట్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ చెకుముకి పరీక్ష 8, 9, 10 వ తరగతి విద్యార్థులకు పాఠశాల స్థాయిలో నవంబర్ 7 న, మండల స్థాయిలో నవంబర్ 21 న, జిల్లాస్థాయిలో నవంబర్ 28, రాష్ట్రస్థాయిలో డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎంలు లక్ష్మీనారాయణ, తండా ప్రభాకర్, వీరన్న, కుమార్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
