ఇంకొన్ని రోజుల్లో ఈ ఏడాది 2025 ముగుస్తుండటంతో 'బై బై' అనే నినాదంతో ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ ఇవాళ్టి(5 శుక్రవారం) నుండి ప్రారంభమై, డిసెంబర్ 10 వరకు ఉంటుంది. చాల OEM(Original equipment manufacturer)లు ఈ సేల్‌లో పాల్గొంటున్నాయి, దింతో ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ పార్ట్నర్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తాయని Nothing ప్రకటించింది.
ఇప్పుడు నథింగ్ ఫోన్ 3 ధర రూ. 49,999, దీని లాంచ్ ధర రూ. 59,999 నుండి భారీగా తగ్గింది. నథింగ్ ఫోన్ 3a ధర రూ. 21,999, నథింగ్ ఫోన్ 3a ప్రో ధర రూ. 26,999, కాగా CMF ఫోన్ 2 ప్రో ధర రూ. 17,499.
SBI లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి ట్రాన్సక్షన్ చేస్తే 5 శాతం ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 1,000 వరకు డిస్కౌంట్, అలాగే సెలెక్ట్ చేసిన వేరియంట్‌లపై ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, నో-కాస్ట్ EMI అప్షన్ కూడా ఇస్తుంది.
నథింగ్ సబ్-బ్రాండ్ CMF కూడా ఆడియో అండ్ ధరించగలిగే వస్తువులపై డిస్కౌంట్ ఇస్తుంది. CMF బడ్స్ 2a ఇయర్‌బడ్‌ల ధర రూ. 1,899 ఇంతకుముందు రూ. 2,199, CMF బడ్స్ 2 ధర రూ. 2,399 ఇంతకుముందు రూ. 2,699, CMF బడ్స్ 2 ప్లస్ ధర రూ. 2,599, CMF వాచ్ ప్రో 2 స్మార్ట్‌వాచ్ ధర రూ. 4,199, డిసెంబర్ 7 వరకు మాత్రమే ఈ అఫర్ ఉంటుంది.
'నథింగ్' ఫోన్లతో పాటు, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16, శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE, శామ్‌సంగ్ గెలాక్సీ S25, మోటరోలా రేజర్ 60 వంటి హై-ఎండ్ మోడళ్లపై కూడా ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై రూ.17వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
