క్రెడిట్​ కార్డుల జారీకి  హెచ్​డీఎఫ్​సీకి అనుమతి

క్రెడిట్​ కార్డుల జారీకి  హెచ్​డీఎఫ్​సీకి అనుమతి

ముంబై: కొత్త క్రెడిట్​ కార్డులు ఇష్యూ చేయడానికి హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఐటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై థర్డ్​ పార్టీ ఆడిట్​ ముగియడంతోపాటు, లోపాల సవరణలకు ఆర్​బీఐ సూచనలు అమలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గత రెండేళ్లలో చాలా సార్లు హెచ్​ డీఎఫ్​సీ ఆన్​లైన్​ సర్వీసులు పనిచేయకపోవడంతో కొత్త క్రెడిట్​ కార్డుల జారీతోపాటు, కొత్త డిజిటల్ ప్రొడక్టులూ తేవొద్దని కిందటేడాది డిసెంబర్​లో ఆర్​బీఐ ఆంక్షలు విధించింది. ​ దీంతో హెచ్​డీఎఫ్​సీ రిటెయిల్​ బ్యాంకింగ్​కు పెద్ద దెబ్బే తగిలింది. దేశంలోనే అత్యధికంగా 1.48 కోట్ల క్రెడిట్​ కార్డులను హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఇష్యూ చేసింది. ఎస్​బీఐ 1.2 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు 1.1 కోట్లు క్రెడిట్​ కార్డులను ఇష్యూ చేశాయి. కొత్త డిజిటల్​ బ్యాంకింగ్​ ప్రొడక్టులపై బ్యాన్​ మాత్రం మరి కొంత కాలం కొనసాగుతుందని ఆర్​బీఐ తెలిపింది.