స్టూడెంట్లు క్రమశిక్షణను అలవర్చుకోవాలి

స్టూడెంట్లు క్రమశిక్షణను అలవర్చుకోవాలి

పర్వతగిరి, వెలుగు: ప్రతి స్టూడెంట్ నిత్యజీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ముందుగా క్రమశిక్షణను అలవర్చుకోవాలని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. వరంగల్​ జిల్లా పర్వతగిరి హైస్కూల్ లో వరంగల్ రోటరీ క్లబ్, మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి స్టూడెంట్లకు మోటివేషనల్ స్పీకర్ మీట్ ను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్టూడెంట్లు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు టీచర్లు కృషి చేయాలని సూచించారు. 

ప్రతి విద్యార్థి కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. అనంతరం సంపాదకులు డాక్టర్ మడత భాస్కర్, పాఠశాల బృందం రూపొందించిన పాఠశాల మాస పత్రిక "అక్షర వాహిని" ఆయన ప్రారంభించారు. 21 మంది స్టూడెంట్లకు రోటరీ క్లబ్ వారి సహకారంలో సైకిళ్లను అందించారు. కార్యక్రమంలో వరంగల్​ డీఈవో రంగయ్య నాయుడు, ఎంఈవో భిక్షపతి, హెడ్మాస్టర్​ నవీన్​కుమార్, పాక రమేశ్ బాబు, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్, వరంగల్ ప్రెసిడెంట్ శివప్రసాద్, క్లబ్ సెక్రటరీ ఎల్లరాజు తదితరులు పాల్గొన్నారు.