- మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
నిజాంపేట, వెలుగు: రేషన్ కార్డులను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ గవర్నమెంట్ దేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని నస్కల్ లో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అంజమ్మకు మద్దతుగా ప్రచారం చేశారు.
కొన్ని సంవత్సరాలుగా గ్రామానికి బస్సు రావడం లేదని స్థానికులు తెలుపగా ఆయన వెంటనే ఫోన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి రామాయంపేట మీదుగా వయా చల్మెడ, నందగోకుల్, నస్కల్, రాంపూర్ గ్రామాల మీదుగా కామారెడ్డి జిల్లా బీబీపేట వరకు బస్ వేయాలని కోరారు. ఆ రూట్ లో బస్సు నడిపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అమర్సేనా రెడ్డి, లక్ష్మా గౌడ్, లింగం గౌడ్, లింగం పాల్గొన్నారు.

