దేశంలోనే తొలి ‘ఈ–రేస్’కు వేదికగా హైదరాబాద్

దేశంలోనే తొలి ‘ఈ–రేస్’కు వేదికగా హైదరాబాద్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రపంచ మోటార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చోటు ఖాయమైంది. ప్రతిష్టాత్మక ‘ఫార్ములా ఈ– రేస్‌‌‌‌‌‌‌‌’ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో  జరుగుతుందని వరల్డ్‌‌‌‌‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఎలక్ట్రిక్​ కార్లతో జరిగే ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం  జనవరిలో ‘ఫార్ములా ఈ’ అధికారులతో ఒప్పందం కుదుర్చుకుంది. ట్యాంక్​బండ్​ చుట్టూ రేస్​ నిర్వహిస్తామని చెప్పింది.  ఫార్ములా వన్ ​మాదిరిగా ‘ఈ–రేస్‌‌‌‌‌‌‌‌’కు ప్రత్యేక ట్రాక్‌‌‌‌‌‌‌‌ అక్కర్లేదు. సాధారణ రోడ్లపైనే  రేసింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తారు. కాగా, 2011 నుంచి 2013 వరకు బుధ్​ ఇంటర్నేషనల్​ సర్క్యూట్​లో ఫార్ములా వన్​జరిగిన తర్వాత దేశంలో జరగబోయే రెండో అతి పెద్ద రేసింగ్ ఈవెంట్ ఇదే కానుంది. అలాగే ఇండియాలో జరిగే తొలి ఈ–రేస్​గా రికార్డులకెక్కనుంది.  దీనికి హైదరాబాద్ ఆతిథ్యం  ఇవ్వడం తెలంగాణకు గర్వకారణం కానుంది.