జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

జమ్మూలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దేశ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నడుం బిగించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జమ్మూలో కూడా 62 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమల ఆలయ ఈవో జవహర్ రెడ్డి తదితరులు ఈ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 33 కోట్ల రూపాయల అంచనాతో రూపొందుతున్న ఈ ఆలయ నిర్మాణం కేవలం ఏడాదిన్నరలోపే పూర్తి చేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం జమ్మూ ప్రభుత్వం 62 ఎకరాల భూమిని 40 ఏళ్ల లీజుకు టీటీడీకి కేటాయించినట్లు సమాచారం.