
ప్రతినెల కొత్త కొత్త ఫోన్లు మార్కెట్లోకి విడుదల ఆవుతుంటాయి. అయితే ఈ సారి ఫెస్టివల్ సీజన్ ముందు కొన్ని కంపెనీలు బడ్జెట్ నుండి టాప్ రేంజ్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ వారం ఇండియాలో కేవలం 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే లాంచ్ కానున్నాయి. వీటిలో Realme, Tecno, Itel సహా Samsung బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌లలో AI ఫీచర్స్, 50-మెగాపిక్సెల్ కెమెరా, 3D AMOLED స్క్రీన్ వంటి స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి.
1. శాంసంగ్ గేలక్సీ S25 FE : శాంసంగ్ గేలక్సీ S25 FE సెప్టెంబర్ 4న ఇండియాతో సహా ప్రపంచ మార్కెట్లో ఒకేసారి లాంచ్ కానుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్, Exynos 2400 ప్రాసెసర్‌తో పాటు Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రావచ్చు. దీనికి 6 సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు ఉంటాయి. ఈ ఫోన్‌లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, ఫోటోగ్రఫీ కోసం 12MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి HD+ డిస్ప్లేతో రావచ్చు. దీని ధర దాదాపు రూ. 60 వేలు ఉండవచ్చు.
2. టెక్నో పోవ స్లిమ్ 5G: టెక్నో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. దీనికి డ్యూయల్-కర్వ్ 3D AMOLED డిస్‌ప్లేతో 5.7mm సన్నగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. పోవా స్లిమ్ 5G ఫోన్‌లో ELLA AI సపోర్ట్ ఇచ్చారు. స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుకుంటే, ఫోన్ పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో పాటు 8GB RAMతో రావచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ 15, గ్రాఫిక్స్ కోసం ARM మాలి G57 GPU చూడొచ్చు.
3. రియల్ మీ 15T : రియల్ మీ 15Tని రూ. 20,999 ధరకు లాంచ్ చేయవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ప్రాసెసర్ తో వస్తుంది. 8GB RAM, 128GB స్టోరేజ్ ఇచ్చారు. ఇదొక 7000mAh బ్యాటరీ తో లాంచ్ కాబోతున్న పెద్ద బ్యాటరీ ఉన్న 5G ఫోన్ అవుతుంది. ఫోటోగ్రఫీ కోసం 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. రియల్ మీ 15T 6.5-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది.
4. ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్: ఐటెల్ బడ్జెట్ ఫోన్ A90 లిమిటెడ్ ఎడిషన్‌ను తీసుకువస్తోంది. ప్రస్తుతానికి దీని లాంచ్ తేదీ వెల్లడించలేదు. స్లిమ్ డిజైన్‌తో ఉన్న ఈ మొబైల్ స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుకుంటే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉండవచ్చు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్, T7100 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 13MP బ్యాక్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా మీకు చూడొచ్చు. పవర్ బ్యాకప్ కోసం 15W ఛార్జింగ్ టెక్నాలజీ, 5000mAh బ్యాటరీ ఉంటుందని భావిస్తున్నారు.
5. Vivo Y500 5G స్మార్ట్‌ఫోన్: Vivo Y500 అనేది అతిపెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్, ఈ ఫోన్ పవర్ ఫుల్ 8200mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే సెప్టెంబర్ 1న చైనాలో లాంచ్ అవుతుంది. నీరు, ధూళి నుండి హై లెవెల్ ప్రొటెక్షన్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ IP69+ రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పూర్తి HD+ OLED స్క్రీన్ ఉండవచ్చు. ఫోటోగ్రఫీ కోసం దీనికి 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.